మెదక్ జిల్లా, ప్రతినిధి ఫిబ్రవరి 16 ( ప్రజా బలం న్యూస్)
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని 16వ వార్డులో గురువారం రోజున వార్డు కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా సిసి రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, అనంతరం వారు మాట్లాడుతూ 16 వార్డులోని పాత హైవే రొడ్డు సూర్య మెడికల్ నుండి కింది వాడకట్టు వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 29.50 లక్షల రూపాయల మంజూరైనందున
ముఖ్యమంత్రి కేసీఆర్ కు , మంత్రి హరీష్ రావుకు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎప్డీసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గల్లీలలో సి సి రోడ్డు నిర్మాణం చేపడతామని తూప్రాన్ పట్టణంలోనే 16వ వార్డును అభివృద్ధిలో తీర్చిదిద్దుతామని కౌన్సిలర్ నారాయణ గుప్తా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అనంతరం వార్డు అధ్యక్షుడు బుక్క విజయకుమార్ మాట్లాడుతూ కౌన్సిలర్ నారాయణ గుప్త ఆధ్వర్యంలో వార్డుల అభివృద్ధి వేగంగా జరుగుతుందని వార్డును కౌన్సిలర్ తో కలిసి మరింత అభివృద్ధి పరిచి తూప్రాన్ మున్సిపాలిటీ లో 16 వార్డు నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్తా, ప్రభాకర్ గుప్తా, వార్డు అధ్యక్షుడు బుక్క విజయకుమార్, , నీలం ప్రవీణ్ గుప్తా, మహ్మద్ హైమద్, కాలనీవాసులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.