ప్రభుత్వ కళాశాలకు విరాళం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 : ప్రభుత్వ కళాశాలకు విరాళం అందించిన మంచిర్యాల మహిళా తరంగిణీ స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు.గురువారం లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి స్వచ్చంద విరాళం అందజేశారు. కళాశాల విద్యార్థినీ విద్యార్థుల పోటీ పరీక్షలకు చదువుకోవడానికి అవసరం అయిన పుస్తకాలు కొనుగోలు చేయడానికి మమత సభ్యురాలు శ్రీమతిముండ్రు సత్యవతీ రామాంజనేయులు పదివేల రూపాయలు నగదును అందజేశారు.అలాగే మమత జాయింట్ సెక్రటరీ కొత్తలీల సురేందర్ 50 కిలోల బియ్యం అందజేశారు.మమత సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి చందూరి సునీత మహేందర్ మాట్లాడుతూ…. మరిన్ని ఉపయోగకరమైన విరాళాలు కళాశాలకి అందజేస్తామని హామీ ఇచ్చారు పేద విద్యార్థుల ప్రయోజనం కోసమే సంస్థ ద్వారా అవసరం అయిన విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. జైకిషన్ ఓజా మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే పేద విద్యార్థుల కోసం ఇలాంటి సేవా సంస్థలు పాటు పడటం సంతోష దాయకమని పేర్కొన్నారు.మమత సంస్థను ఆదర్శంగా తీసుకోని మరిన్ని సంస్థలు కళాశాలకి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తే విద్యార్థులకు చేయూత ఇచ్చినవారు అవుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.జైకిషన్ ఓజా వైస్ ప్రిన్సిపాల్ డా. గంగయ్య ,ఐక్యుఎసి కో ఆర్డినేటర్ సవిత ఎన్ .ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ కుమారస్వామి లైబ్రేరీ ఇంచార్జ్ డా. రాజ్ కుమార్,అధ్యాపకులు డా. శ్రీలత,డా.సురేష్, డా. హరేశ్, మంజుల,ఇందిరా దేవి,మల్లయ్య, మహేష్,రాయలింగు బోధనేతర సిబ్బంది.కళాశాల ఆద్యాపకులు, బోధనేతర సిబ్బంది,విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking