ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 16( ప్రజాబలం) పాలేరు నియోజకవర్గం వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని గురువారం విజయమ్మ ప్రారంభించారు జూన్ 8న మన సొంత కార్యాలయం ప్రారంభించుకుందాం అని అన్నారు వైయస్సార్ ప్రతి క్షణం పేదల గురించే ఆలోచించే వారు అని రాజన్న కుటుంబం అంటే జగమంత కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జీవితంలో మాట తప్పని మడమ తిప్పని నాయకుడని వైయస్సార్ షర్మిల కూడా మాట ఇస్తే ఎందాకైనా వెళ్తుందని చిత్తశుద్దితో రాజకీయాలు చేయాలనే షర్మిల ప్రజాప్రస్థానం ఎన్ని అవమానాలు చేసినా అన్నింటా తట్టుకొని ముందుకు అడుగేస్తుంది ప్రజాప్రస్థానం 4వేల కిమీ అంతకు ముందు 3వేల కి మీ షర్మిల నడక వైయస్సార్ బంగారు పాలన కోసమే అని షర్మిల అడ్రస్ ఎక్కడా అంటే పాలేరు అనే చెప్తున్నాం రానున్న రాజకీయాలకు షర్మిల పాలేరు నిర్ణయం గుమ్మం అవుతుంది ప్రతి కుటుంబంలో షర్మిల ను గుండెలలో పెట్టుకుంటారు షర్మిల 4కోట్ల తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది వైయస్సార్ ప్రేమా మానవత్వం షర్మిల ప్రజలకు పంచుతోంది పాలేరు నుండే తెలంగాణ ను పరిపాలిస్తుంది మంచి నాయకులుంటే మంచి పరిపాలన రాష్ట్రంలో ఉంటూంది వైయస్సార్ కు పాలేరుకు రూణానుబంధం ఉంది ఇదంతా దైవేచ్చే ఎల్లప్పుడూ ఖమ్మం జిల్లా మాకు అండగానే నిలిచింది ఎప్పుడో వైయస్సార్ పాలనలో మొదలెట్టిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా పూర్తి చేయలేకపోయారు షర్మిల చేతి మీదుగానే అవి ప్రారంభ మౌతాయనుకుంటా ఆంధ్రాలో పులివెందుల ఎలానో తెలంగాణ లో పాలేరు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లక్కినేని కిషోర్ మరియు ఖమ్మం ఇంచార్జ్ తుంపాల కృష్ణమోహన్ షర్మిల వ్యక్తిగత సాయ కార్యదర్శి నంద్యాల రవీందర్ రెడ్డి నాలుగు మండలాల అధ్యక్షులు మరియు తోట చిన్న వెంక రెడ్డి తదితరులు పాల్గొన్నారు