ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముత్యంపేట శాఖ ఆధ్వర్యంలో ముత్యంపేట అధికారులు అక్షరాస్యత అవగాహన సదస్సు జరిగింది. బ్యాంకు మేనేజర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ…బ్యాంకు ఖాతాదారులందరూ తమ ఖాతాలను సక్రమంగా నిర్వహించడం,ఖాతాలకు అర్హతను మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ సర్వీస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం! కార్డు, మిస్డ్ కాల్ అలర్ట్ తదితర సౌకర్యాలను ! వినియోగించుకోవాలని. బ్యాంకుల ద్వారా గ్రామాలలో ప్రవేశపెట్టబడిన ఎస్పీ సెంటర్ల ద్వారా బ్యాంకులకు రాకుండానే తమ ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.సి ఎస్ పి సెంటర్లలో డబ్బులు జమ చేసిన, తీసుకున్న ప్రతి లావాదేవీకి రసీదును తప్పనిసరిగా తీసుకొనవలెనని దానితో డబ్బులు సరిచూసుకోవాలని చెప్పారు. రైతులు తీసుకున్న పంట రుణాలు సంవత్సరం లోపు కట్టడం వలన కేవలం ఏడు శాతం – శ్రీ వడ్డీ మాత్రమే ఉంటుంది, సంవత్సరానికి సమయానికి కట్టడం వలన నాబార్డ్ ద్వారా మూడు శాతం వడ్డీ రిబేటు వర్తిస్తుందని. ఇంకా రైతుల సిబిల్ స్కోర్ కూడా పెరిగి ఇతర రుణాలు సమయానికి పొందే సౌలభ్యం లభిస్తుందని తెలిపారు. ఒకవేళ సంవత్సరం తర్వాత కట్ట 12.5 నుంచి 14 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుందని ఏ విధమైన రిబేటు రాదని తెలిపారు. ఖాతాదారులందరూ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన,ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన,అటల్ పెన్షన్ యోజన ఇంకా బ్యాంకు ద్వారా అందించే ఎస్ బి ఐ జనరల్ ఇన్సూరెన్స్ పథకం 1 మొదలగు వాటిని కూడా ఉపయోగించుకొని తమ భవిష్యత్ తరాలు ! ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని ప్రస్తుత రైతుబంధు డబ్బుల్లో పడుతున్న వాటిని సద్వినియోగం చేసుకొని తమ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ,మిగిలిన డబ్బులను బ్యాంకుల్లో మాత్రమే జమ చేసుకోవాలని తెలిపారు. బ్యాంకులో లభించే ఇతర సేవలు లైఫ్ ఇన్సూరెన్స్,మ్యూచువల్ ఫండ్ మొదలగు వాటియందు తమ ఆర్థిక స్థితిగతులను బట్టి ఖాతాదారులు పెట్టుబడి పెట్టి భవిష్యత్తు ఆర్థిక సుస్థిరతకు పాదులు వేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని వయోజనులైన ప్రతి ఒక్కరు కచ్చితంగా బ్యాంకు ఖాతా ఉండాలని,అందుచేత ప్రభుత్వం అందించే సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాషియర్ పీ అయబ్ ఖాన్ సిబ్బంది,మహిళా సంఘాల సభ్యులు ఖాతా దారులు తదితరులు పాల్గొన్నారు.