* గాంధీ సిద్ధాంతాలతో నే తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు
*నిజాయితీగా పనిచేస్తే తప్పకుండ సక్సెస్సాధిస్తాం .జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మెదక్జాతి పిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు
సోమవారం మాహత్మాగాంధీ 154 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని గాంధీ చిత్రపటానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి , అదనపుకల్లెక్టర్ లు రమేష్, వెంకటేశ్వర్లు తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయితీగా పనిచేస్తే తప్పకుండ సక్సెస్ సాధిస్తామని అన్నారు. సత్యగ్రహమే అయుధంగా అహింస, శాంతి మార్గములో దేశానికి స్వాతంత్య్ర సముపార్జ చేసిన మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. అహింస మార్గంలో ఎటువంటి పనినైనా సాధించవచ్చని , వారు చూపిన మార్గములో పయణించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు . జాతి పిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని, అన్నారు . ఫాదర్ఆఫ్ నేషన్, గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. గాంధీ సిద్ధాంతాలతో నే తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు . పట్టణంలో స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. పట్టణాలలో,గ్రామాలలో పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు విరివిగా నాటి పర్యావరానాన్ని పరిరక్షించాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు మహాత్మాగాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పద్మశ్రీ , జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
