వేలం పాటలో గణపతి లడ్డు దక్కించుకున్న ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్

 

మెదక్ తూప్రాన్ అక్టోబర్ 2 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో శ్రీ వినాయక ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువకుల కోలాటం, మహిళల నృత్యాలు, చిన్నారుల ఆటపాటలతో గణనాధుని నిమజ్జన ఊరేగింపు అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమానికి తూప్రాన్ ఎస్సై శివానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన లడ్డు వేలంపాటలో ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ 36వేలకు మహా ప్రసాదాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే చిన్నారుల లడ్డును వేలంపాటలో మన్నె మహేష్ యాదవ్ 7200 లకు దక్కించుకున్నారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పాక్స్ డైరెక్టర్ గోపి,సంగం అధ్యక్షులు జింక శేఖర్, ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, కోశాధికారి చెన్నయ్య, కాస సత్యం, జిన్న వెంకటి, సభ్యులు పెంటారెడ్డి, వెంకట్ రెడ్డి,కొండల్ రెడ్డి, మన్నె శ్రీనివాస్, పాప సాయిలు, జిన్న రమేష్, కటికే బాబాజీ, అవుసుల చారి, జిన్న స్వామి, మన్నె రమేష్, కొంతం శివులు, జిన్న నరసింహులు, చింతల నరసింహులు, శకుంతల మరియు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking