మురుగు వ్యర్థాల రవాణా వాహనాల పంపిణీ

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02 అక్టోబర్ 2023: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకంలో భాగంగా ఐ.టీ మరియూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలపమెంట్ శాఖా మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావుతో కలసి పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 162 మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ తన నియోజక వర్గ లబ్ధిదారులకు మంజూరు అయిన 7 వాహనాలను సెక్రటేరియట్ పక్కనగల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగినదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతు దళిత బంధు పథకం ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించిందని ఇందులో భాగంగా మరిన్ని కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని సంకల్పించిందని ఇందు నిమిత్తం హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల మండలి ఆధ్వర్యంలో నడిచే మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను అందచేసింది. పలువురు దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ముఖ్యోద్దేశం. దీని వల్ల ఆయా కుటుంబాలకు జీవనోపాధి లభించడంతో పాటు ఆర్థికంగానూ స్థిరపడే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ తది తరులు ఉత్సాహంతో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking