నిందితుల అరెస్ట్
5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాదీనం,వాటి విలువ 15,00,000/-
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 01: కల్తి,నకిలీ విత్తనాల రూపుమాపి రైతుకు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పని చేయడం జరుగుతుందని దానిలో బాగంగా రామగుండం పోలీస్ కమీషనరెట్ మంచిర్యాల జోన్ నేన్నాల్ మండలం బొప్పారం గ్రామం లో ని కర్నకొండ చంద్రశేఖర్ తన ఇంటి ఆవరణలో నిషేధిత (బిటి-3) నకిలీ పత్తి విత్తనాలు అక్రమ నిల్వ చేసి అమాయక రైతులకు మాయమాటలు చెప్పి అమ్ముతున్నడనే నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్,ఎస్సై లచ్చన్న, సిబ్బంది లతో కలిసి ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా సుమారు 15,00,000/- విలువైన 05 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగింది. అనంతరం అతన్ని విచారించగ ఇట్టి విత్తనాలు రజాక్,బైంసా,జానీ, మందమర్రి అనేవారి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిననని అట్టి పత్తి విత్తనాలు సొల్లు పెద్దయ్య @ సురేష్ అక్రమంగా రవాణా చేసి నాకు అందచేసినాడు అని ఇట్టి పత్తి విత్తనాలు అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై నిల్వ ఉంచనని తెలిపాడు.5 క్వింటాళ్ల లలో సూరం దిలీప్ మరియు కల్లూరి వెంకటేశం లకు కూడా భాగం కలదు .ఇట్టి వ్యక్తులపై యూ/ సెక్షన్ 420 ఆర్/డబ్ల్యూ 34 ఐ పీ సి సెక్షన్19 ఆఫ్ సీడ్స్ యాక్టివ్ సెక్టర్ సెక్షన్ 5(1) Environment Protection Act ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.
నిందితుల వివరాలు
1) కర్నకొండ చంద్ర శేఖర్ తండ్రి రామన్న, వయస్సు 32 సంవత్సరాలు, కులం కాపు,వృత్తి వ్యవసాయం,గ్రామం బొప్పారం,మండలం కన్నెపల్లి జిల్లా మంచిర్యాల,
2) సూరం దిలీప్,తండ్రి బీమయ్య,వయస్సు 35, వృత్తి వ్యవసాయం కులం తెనుగు,గ్రామం చాక్పెల్లి, మండలం బెల్లంపెల్లి,జిల్లా మంచిర్యాల,
3) కల్లూరి వెంకటేశం తండ్రి నామ్‌దేవ్,వయస్సు 61 సంవత్సరాలు,కులం వైశ్యులు,వృత్తి వ్యాపారం, గ్రామం కాసిపేట,మండలం కాసిపేట,జిల్లా మంచిర్యాల స్వాధీన చేసుకొన్న వాటి వివరాలు,05 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు,వాటి విలువ 15,00,000/- నగదు, మొబైల్ ఫోన్స్01,తదుపరి విచారణ నిమిత్తం నిందితులు నకిలీ పత్తి విత్తనాలను స్వాదీన పర్చుకొని,నిందితున్ని నేన్నాల్ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.రైతులను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని,ఎవరైన నకిలీ విత్తనాలను,విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని.ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే సమచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా, వుంచబడుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.