మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాబలం) ఫిబ్రవరి 9
మహబూబాబాద్ జిల్లా :
కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం..
యాసంగి వరినాటు వేసేందుకు వెళ్లిన మహిళా కూలీలు బురద కడుక్కునేందుకు వెళ్లగా ఒక్కసారిగా మొసలి కనిపించడంతో ఒడ్డుకు పరుగులు తీసిన జనం
మైలారం, కొత్తపల్లి, పొగుళ్లపల్లి, గుండంపల్లి ప్రాంతాల నుండి వర్షాకాలం వరద నీటికి పాఖాల చెరువు నుండి పెద్ద చెరువులోకి వచ్చిన మొసలి..
పాకాల సరస్సులో సుమారు 500 వరకు ముసల్లో ఉండవచ్చని సమాచారం ఉందని పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్త ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు
ప్రతి రోజు ఉదయం వేళలో ఒడ్డుకువస్తుండడంతో భయాందోళనలో గ్రామస్థులు, ఆయాకట్టు రైతులు .