ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఎన్.టి.ఆర్.స్టేడియంలో
నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్,నిర్మల్, ముధోల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.నిర్మల్ ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు, ప్రజలందరికి భాగస్వామ్యంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాకు చెందిన పలువురు కళాకారులు, విద్యార్థులచే ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా చరిత్రకు సంబంధించిన వివరాలను ప్రొఫెసర్ డా.మురళి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్,ఎస్పీ, ఎంపీ, శాసనసభ్యులు, అదరపు కలెక్టర్లు, అధికారులు, తదితరులు సందర్శించారు. అనంతరం ప్రజా ప్రతినిధులను జిల్లా కలెక్టర్,శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్ర రెడ్డిలు,బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, సందర్శకులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు