-అభినందించిన జీఎం జి.దేవేందర్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 6
హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన 11 తెలంగాణ స్టేట్ లెవెల్ అథ్లెటిక్ పోటీలలో మందమర్రి ఏరియా సింగరేణికి చెందిన పి .సమ్మయ్య పాల్గొని పలు బహుమతులు సాధించిన సందర్భంగా సోమవారం మందమర్రి జిఎం జి. దేవేందర్ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఎ.ఎస్. ఓ సర్వే చైర్మన్ గా పనిచేస్తూ క్రీడ పట్ల ఆసక్తితో గచ్చిబౌలిలో జరిగిన అథ్లెటిక్ పోటీలలో పాల్గొని 5కె రన్ లో గోల్డ్, 1500 మీటర్స్ రన్ లో సిల్వర్, 800 మీటర్స్ రన్ లో బ్రాంజ్ మెడల్స్ ను సాధించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సర్వే ఆఫీసర్ ఉజ్వల్ బందోపాధ్యాయ, ప్రసాద్, నరేష్, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.