చిత్ర పూరి కాలనీకి చెందిన డి. అన్నపూర్ణ అనారోగ్యం వలన నిమ్స్ ఆసుపత్రి లో చేరగా ఆసుపత్రి ఖర్చులు కట్టే ఆర్థిక స్థోమత లేదని గౌరవ ఎం ఎల్ ఏ ప్రకాష్ గౌడ్ కౌన్సిలర్ డా.వసంత్ రావు చౌహన్ ద్వారా తెలియపరచడం జరిగింది.పై విషయం గురించి గౌరవ ఎం ఎల్ ఏ ప్రకాష్ వెంటనే స్పందించి 1,00,000/-(లక్ష రూపాయలు మాత్రమే) సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ గురువారం రోజు అన్నపూర్ణ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ విషయం లొ కృషి చేసిన ఎం ఎల్ ఏ ప్రకాష్ ి,ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి , స్థానిక కౌన్సిలర్ వసంత్ రావు చౌహన్ ి మరియు స్థానిక నాయకులకు, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు