డి.ఎస్.సి. మెరిట్ లిస్టు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03 :
డి.ఎస్.సి.2024 మెరిట్ లిస్టులో స్థానం కలిగి ఉన్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా, పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని కార్మల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ధృవపత్రాల పరిశీలన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్యతో కలిసి హాజరై పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు డి.ఎస్.సి. 2024 మెరిట్ లిస్టులో ఉన్న 715 మంది అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పరిశీలన కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, అధికారులు ధృవపత్రాలను పరిశీలించే సమయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking