ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 03 : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముత్యంపేట శాఖ నాబార్డ్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం గురువారం రోజున నిర్వహించారు.గ్రామ ప్రజలకు వివిధ రకాల లోన్ ప్రొడక్ట్స్,డిపాజిట్ స్కీమ్స్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది వీటి తో పాటు ఎన్ పి ఎస్ వాత్సల్య స్కీముల గురించి సామాజిక భద్రత పథకాల గురించి అలాగే డిజిటల్ సేవలు గురించి పొదుపుల గురించి చాలా చక్కగా కళాజాత వారు మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా చాలా చక్కగా తెలియజేశారు.
శాఖ మేనేజర్ ఎన్ కిషోర్ కుమార్,జీ నవ్యశ్రీ,జీ సాగర్ పాల్గొన్నారు.ఎంవీ రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళజాతర బృందం సభ్యులు మహేష్, రీయాజ్ పాల్గొన్నారు.