డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలీ..

 

ప్రజాబలం దినపత్రిక మెదక్ నియోజకవర్గం
03.10.2024:

గురువారం శంకరంపేట మండలం కామారం గ్రామంలో జరుగుతున్న డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ పరిధిలో శంకరంపేట మండలం కామారం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. మెదక్ నియోజకవర్గ లో జరుగుతున్న సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా ఆర్డిఓ రమాదేవి ను నియమించామని తెలిపారు. మెదక్ మున్సిపల్, జరుగుతున్న సర్వే ప్రక్రియ కు 04 టీములు, శంకరంపేట మండలంలో 02 టీములు ఏర్పాటు చేశామని, ప్రతి టీముకు 04 సిబ్బందిని నియమించి నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ పద్ధతిన అమలు చేయనున్న కుటుంబానికి డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియలో కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబం వివరాలు డిజిటల్ కార్డు సర్వేలో తప్పకుండా
నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేకు కావలసిన నోడల్ అధికారి బృందాల పనితీరును పర్యవేక్షణ చేయాలని అన్నారు. కుటుంబ గుర్తింపు కోసమే
ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా కుటుంబంలో ఎంత మంది ఉన్నారు, వారి సమగ్ర వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఒక రాష్ట్రం ఒక కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉంటుందని తెలిపారు. కుటుంబంలోని ఎక్కువ వయసు కలిగిన మహిళలు కుటుంబ పెద్దగా ఉంటారని అన్నారు. దీంతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా గుర్తింపు సంఖ్య ఉంటుందని తెలిపారు. కుటుంబ వివరాలతో పాటు కొత్తగా కుటుంబంలోకి వచ్చిన వారు, జన్మించిన పిల్లల వివరాలను పొందుపరచడంతో పాటు చనిపోయిన, వివాహం చేసుకొని వెళ్లిన వారి వివరాలను తొలగించాలని అన్నారు. కుటుంబ సభ్యుల అనుమతితో గ్రూప్ పరిధిలోని కుటుంబాల సంఖ్య ఆధారంగా ఫోటోలు తీయాలని అన్నారు. సర్వే బృందాలు కుటుంబాలు సర్వే పూర్తి చేయుటకు ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఐదు రోజుల్లో కుటుంబ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే బృందాలకు కుటుంబం యొక్క సమగ్ర వివరాలు అందచేయాలని సర్వే ప్రకీయకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking