ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 08 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటా హనుమాన్ చాలీసా నిత్య పారాయణ రోజు 3670 రోజుకు చేరుకుంది.ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యన హనుమాన్ చాలీసా భజన జరుగుతుందని చాలీసా భక్త బృందం వారు తెలిపారు.హనుమాన్ చాలీసా నిత్య పారాయణం సోమవారం బొప్పు సతీష్ చంద్రకళ ఇంట్లో నిర్వహించారు.భక్త బృందం వారికి ఐదు వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అదేవిధంగా అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం బొప్పు సతీష్ చంద్రకళ దంపతులు గాంధీనగర్ లో అయోధ్య అక్షింతలను గడప గడపకు వెళ్లి అక్షింతలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా భక్త బృందం, లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి రమేష్, దండేపల్లి జెడ్పిటిసి గడ్డం నాగరాణి త్రిమూర్తి,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,మోటపలుకుల సత్తయ్య,సుధీర్,తిరుపతి, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.