జమ్మికుంట ప్రజబలం ప్రతినిధి సెప్టెంబర్ 15
దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో దళితబందు రెండవ విడత నిధులు మంజూరు చేయాలనీ జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన చేసిన బాధితులు ఇప్పటికే దళిత బందు విడుదల చేయాలనీ అనేక కార్యక్రమలు చేసిన ప్రభుత్వం స్పందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల పట్ల వివక్షత చూపుతున్నాడని దళితులు ఆర్థికంగా ఎదగడం ముఖ్యమంత్రి కి ఇష్టం లేనట్టు వ్యవహరిస్తున్నాడని ఈ వైఖరి మారుకోకపోతే దళితుల ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని సాధన సమితి సభ్యులు అన్నారు.దళితబందు పథకంలో వాహనాలు పెట్టికున్న వారికీ పూర్తిస్థాయిలో 10లక్షలు మంజూరు చేసినట్టు షాపులు పెట్టుకున్న వారికీ కూడా మిగతా 5లక్షలు మంజురు చేసి దళితుల అభ్యున్నతికి తోడుపడాలని లేని పక్షంలో దళితులం అంత ఏకమై హైదరాబాద్ నడి ఒడ్డున వెలసంఖ్యలో వచ్చి దళితల సత్తా ఏంటో ఈ ప్రభుత్వని తెలిసేలా చేస్తామని మండిపడ్డారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక సంస్థల ఎన్నికల లోపు రెండవ విడత నిధులు మంజూరు చేసేవిదంగా చొరవ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, కోలుగూరి నరేష్,అకినపల్లి ఆకాష్, ఇనుగాల బిక్షపతి,కోడెపాక రక్షిత్, గాజుల కూమర్,మహంకాళి రమేష్,రామంచ శ్రీకాంత్,పాత రాజేష్,ప్రవీణ్,సరిత,అరుణా తదితరులు పాల్గొన్నారు.