సామాన్యుల అమాయకత్వమే వ్యాపారస్తుల ఆదాయవనరుగా మారుతోంది
ఇంటి స్థలం కానీ వ్యవసాయ స్థలం కొనుక్కోవాలనుకునే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి
స్థలానికి సంబందించిన సరియైన దృవ పత్రాలు ఉన్నాయా లేవా అని సరి చూసుకోవాలి
జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
15.09.2024:
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములకు భారీగా డిమాండ్ ఏర్పడింది. శివారులో భూమి కొనుగోలు చేయాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని ఇంటి స్థలం కానీ వ్యవసాయ స్థలం కొనుక్కోవాలనుకునే సామాన్యుల అమాయకత్వమే వ్యాపారస్తుల ఆదాయవనరుగా మారుతోందని ఎవరైనా ఇంటి స్థలం కానీ వ్యవసాయ స్థలం కొనుక్కోవాలనుకునే ప్రజలు తగు జాగ్రత్తలు, స్థలానికి సంబందించిన సరియైన దృవ పత్రాలు ఉన్నాయా లేవా అని సారి చూసుకోవాలని అట్టి స్థలం సరియైనదేనా లేక రియల్ ఎస్టేట్ చేసే మోసగాళ్ల పనా అని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని డబ్బులు ఎవరికి ఊరికే రావని తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను తమ పిల్లల భవిష్యత్తు కోసం స్థిరాస్తుల పై పెట్టుబడిగా పెడతారని అలాంటి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని పేద మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసి ఇబ్బందుల పాలు అవుతున్నారని మరియు ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మా దృష్టికి వచ్చింది. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఆదేవిదంగా రియల్ ఎస్టేట్ ఆగడాల వలన ఎంతోమంది బాధితులు అయిన కేసుల్లో భరోసా కల్పించడానికి పెద్ద శంకరంపేట పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియా నిందితులను అరెస్ట్ చేసి మెదక్ జిల్లా కోర్టు ముందు హాజరుపరచడం జరిగినదని హైదరాబాదు నుండి పెద్ద శంకరంపేట మండల పరిధిలో భూములు కొనడానికని వచ్చిన వాళ్లను ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్యవర్తులుగా ఉండి రోడ్డు సైడు మెయిన్ బిట్ అమ్మడానికి ఉందని ఫేస్బుక్లో ఫోటోతో ఫోన్ నెంబర్ తో పోస్ట్ చేసి వాటిని చూసి నిజమని నమ్మిన వారు సంప్రదించగా వారికి మెయిన్ రోడ్డు బిట్టు చూయించి ఎక్కువ డబ్బులు తీసుకొని మోసం చేసి రోడ్డు నుంచి దూరంగా ఉన్న వ్యవసాయానికి పనికి రాని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లోని భూమిని రిజిస్ట్రేషన్ చేసి మోసం చేస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి కి చెందిన ఆడం జ్యోతి గారు ఫేస్బుక్లో వారు చేసిన పోస్టుకు స్పందించి పెద్ద శంకరంపేటలోని పుతులూరు గ్రామ శివారులోని రోడ్డు సైడు బిట్టు అమ్మడానికి ఉన్నదని దాన్ని 31 లక్షల 40 వేల రూపాయలకు మాట్లాడుకుని పెద్ద శంకరంపేట తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత భూమి దగ్గరికి వెళ్లి చూసే సరికి మోసపోయిన విషయం తెలిసినది అందులో పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఏడుగురిపై ఫిర్యాదు ఇవ్వగా ఇట్టి ఫిర్యాదును పరిశీలించిన సిబ్బంది సీర్ . No. 133/2024 U/s 120 B, 406, 420, 417, 506 r/w 34 ఇపీసీ నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను మెదక్ జిల్లా కోర్టు ముందు హాజరుపరచగా గౌరవ న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విదించినారు అని తెలిపినారు.
నిందితుల వివరాలు
1. ఏ -1 చవాన్ సాగర్ స్ /o దేవిదాస్, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: ఎస్టీ లంబాడా, ఓసీసీ : వ్యాపారం, R/o ముకుంద నాయక్ తండా కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా
2. ఏ -3 జంగం శ్రీనివాస్ @ జంగం శ్రీను స్ /o నాగయ్య, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: పద్మశాలి, ఓసీసీ : వ్యాపారం, ర్ /o పెద్ద శంకరంపేట గ్రామం మరియు మండలం,
మిగతా వారు పరారీలో ఉన్నారని వారిని కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరు పరుస్తామని అన్నారు.