ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
కన్నుల పండువగా గణనాథుడి శోభాయాత్ర
గణేష్ నిమజ్జనం చూసేందుకు తరలివచ్చిన నగర ప్రజలు
దారిపొడువున వెళ్తున్న గణపతులకు దర్శించుకున్న ప్రజలు*
సెల్ఫీలు దిగుతూ సందడి చేసిన యువత*భారీ పోలీస్ బందోబస్తులో గణేష్ నిమజ్జనం
భైంసా పట్టణంలో జన స్వరం పట్టణంలోని గణేష్ నిమజ్జనం ఆదివారం వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, ఫలహారాలతో స్వామి వారిని భక్తులు పూజించారు. ఉదయం వినాయక మండపాల్లో నిమజ్జనం రోజు స్వామి వారి ఎదుట ఉంచిన లడ్డూకు వేలం పాట నిర్వహించారు. అనంతరం గణపతి బప్పా మోరియా అంటూ నిమజ్జనానికి విగ్రహాలను తరలించారు.
యువకులు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ, డీజే శబ్దాల మధ్య విచిత్ర వేషధారణలతో గణేశుడిని వీధుల్లో ఊరేగించారు. గణేశుడి శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన భక్తజనంతో అనంత వీధులు కిక్కిరిసిపోయాయి. పట్టణ ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రజలు వేలాదిగా చేరుకుని అర్ధరాత్రి వరకూ వినాయకుడి శోభాయాత్రను తిలకించారు.గణేష్ నిమజ్జనం సందర్భంగా వేలది భక్తులు తరలి రావడంతో గడ్డేన్నా వాగు కిక్కిరిసిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభయాత్ర, భారీగా వచ్చిన బక్తుల సందడి నడుమ వైభవంగా కొనసాగింది.ముందుగా గడ్డేన్నా వాగు వద్ద స్థానిక ఎమ్మెల్యే, పాటు జిల్లా పోలీస్ అధికారి జానకి షర్మిలా, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, చేతులు మీదుగా పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.జిల్లా పోలీస్ అధికారి జానకి షర్మిలా,భైంసా ఏఎస్పీ, అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐలు 28, ఎస్సైలు 32, పోలీస్ కానిస్టేబుల్స్ 600 మందితో, బందోబస్తు చేశామని ఏస్పీ తెలిపారు.గణేష్ నిమజ్జనం వెళ్లే రోడ్డు మార్గంలో 230 సీసీ కెమెరాలు పాటు విడియో గ్రాఫిక్ ,డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తు లో,గణేష్ నిమజ్జనం పూర్తి చేశారు.గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్‌వారి సూచలను పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తిచేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావ్ పటేల్ పేర్కొన్నారు.