శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ జిల్లా లోని పలు ఆలయాలని దర్శించిన డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రం లో శ్రీరామ నవమి సందర్భంగా బ్రహ్మపురి ,నర్సాపూర్ మండలం ,నిర్మల్ శాంతినగర్ లోని ప్రసిద్ధి గాంచిన శ్రీరాముల వారిని దర్శించుకున్నారు.శ్రీరాముల వారి ఆశీస్సులతో నిర్మల్ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా శ్రీహరి రావు గారిని ఆలయ పూజారులు ఆశీర్వదించారు.ఆలయ కమిటీ శాలువ తో సత్కరించారు. శ్రీహరి రావు
గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.శ్రీరాముల వారు పితృ వాక్కు పరి పాలకుడు, ప్రజా వాక్కు పాలకుడని రాజులు, రాచరిక వ్యవస్థ ఉన్న కాలంలోనూ సత్యం, న్యాయం, ధర్మంతో ప్రజల మాటకు విలువనిస్తూ,ప్రజాస్వామ్య పాలన చేసిన మహనీయ వ్యక్తి అని అన్నారు.ఆయన పాలన అప్పటికి,ఇప్పటికి,ఎప్పటికి,ఆదర్శ ప్రాయమే అని అన్నారు.మనం ఉన్న ఈ ప్రజాస్వామ్య పరిపాలనా కాలంలో ప్రజలకు మరింత జవాబుదారితనంతో పాలన అందించాలి అని అన్నారు.ఆ సీతారాముల అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం సర్వ సుభిక్షంగా ఉండాలని,ప్రజలంతా సుఖ సంతోషాలతో,ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమం లో శ్రీహరి రావు గారితో నిర్మల్ మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ,మాజీ మునిసిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి,కౌన్సిలర్లు,నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి ,లక్ష్మణ్చాంద మండల మాజీ ఉపాధ్యక్షులు నరేష్ రెడ్డి,పూదరి అరవింద్,బురాజ్,కొంతం గణేష్, ఆకుల రామకృష్ణ ,చిరంజీవి,కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.