రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.
పరిగి ప్రజాబలం ప్రతినిధి:గుండె పోటుతో మృతిచెందిన పరిగి మాజీ ఎంఎల్‌ఏ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. పరిగిలోని ఆయన భౌతిక కాయానికి పూల మాలలతో నివాళులర్పించిన మహేందర్ రెడ్డి. హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుమారులు ప్రస్తుత ఎంఎల్‌ఏ కొప్పుల మహేష్ రెడ్డి, అనిల్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మహేందర్ రెడ్డి. గతంలో టీడీపీలో ఆయనతో ఉన్న అనుబంధం గుర్తుకు చేరుకున్న మంత్రి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ గా, పరిగి నియోజక వర్గానికి ఎంతో కాలం ఎంఎల్‌ఏ గా హరీశ్వర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడిన మహేందర్ రెడ్డి. లిఆయన లేని లోటు తీరనిదని పేర్కొంటూ,ఆయన పవిత్రాత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించిన మంత్రి మహేందర్ రెడ్డి
Prev Post
Next Post