ఈ ఓక్కసారి ఖమ్మంలో నాకు అవకాశం ఇవ్వండి

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ..

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని 54 వ డివిజన్ లోని విడివోస్ కాలనీ నందు చేకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సమ్మేళనం లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడూతూ మహిళ బిల్లు అమలు లోకి వస్తే ఖమ్మం మహిళలకు అవకాశం వస్తూం దని కాబట్టీ ఈ ఓక్కసారి ఖమ్మంలో గెలిపించండి మిగిలిన పనులు పూర్తి చేస్తానని అన్నారు.ఇక నా కుటుంబం నుండి మహిళలు ఏవ్వరు రాజకీయాలలోకి రారని కొత్తవారికి అవకాశాలు దక్కుతాయన్నారు.ఈనెల చివరిలో మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా మున్నేరు పై రిటర్నింగ్ వాల్ పనులు ప్రారంభోత్రం ఉంటుందని మంత్రిగా నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సంధర్బంగా ఖమ్మం నగర అభివృద్ది కి కేటిఆర్ వంద కోట్లు నిధులు ఇచ్చారని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking