అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి జనవరి 16 (ప్రజాబలం) ఖమ్మం జనవరి,31 నాటికి 2022-23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సిఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ పేర్కొన్నారు. గడువులోగా31-01-2024 నాటికి డెలివరి చేయని యెడల అట్టి మిల్లర్లు, వారికి జమానత్ ఉన్న మిల్లర్ల పై అగ్రిమెంట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కమీషనర్ సివిల్ సప్లైయిస్ వారి ఆదేశాల మేరకు మిల్లర్లపై చర్యలుంటాయని ఆయన అన్నారు. డెలివీరీ చేయాల్సిన సిఎంఆర్ రైస్‌పై రోజువారి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికనుగుణంగా త్వరిత గతిన గడువులోగా సిఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని ఆయన తెలిపారు.