బుధవారం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 16 (ప్రజాబలం)ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం పదకొండు గంటలకు నేలకొండపల్లి మండలంలోని బోదులబండ, నేలకొండపల్లి గ్రామాల్లో, మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూసుమంచి మండల కేంద్రంలో, ఒంటిగంటకు తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, పాతర్లపాడు, జింకలగూడెం గ్రామాల్లో, మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామంలో, మూడున్నర గంటలకు ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారని తెలిపారు. అదేవిధంగా ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking