ఏబిసిడి వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూఈనెల 23 ఎమ్మార్పీఎస్ & ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే సన్నాక సమావేశాన్ని విజయవంతం చేయండి

 

 

..మల్లిగారి యాదగిరి (ఎం ఎస్ పి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్)

సంగారెడ్డి మార్చి:21(ప్రజ బలం ప్రతినిధి)
ఈరోజు21/03/2023, మంగళవారము సంగారెడ్డి బైపాస్ నందు ఎం ఎస్ పి ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం 4వ తరగతి ఉద్యోగుల భవనం నందు జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మల్లిగారి యాదగిరి హాజరై, ఈ సందర్భంగా మాట్లాడుతూ తేది:23/03/2023, గురువారం రోజున మధ్యాహ్నము 2:00 గంటలకు ఎమ్మార్పీఎస్ & ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల సన్నాహక సభ జరుగుతుంది, ఈ కార్యక్రమానికి ముఖ్యగతిథులు ఎమ్మార్పీఎస్&ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారు. కనుక ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ పొట్టోళ్ల వెంకటేష్ మాదిగ, ఎర్రోళ్ల నరసింహులు మాదిగ ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు, కెంపుల రాజు ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అబ్రహం మాదిగ ఎంఎస్పీ జిల్లా co-ఇంచార్జి, మాతంగి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లాకో కన్వీనర్, గంగేరి శ్రీనివాస్ మాదిగ ఎమ్మెస్పీ సంగారెడ్డి జిల్లా నాయకులు, దేవరంపల్లి అశోక్ మాదిగ ఎం జె ఎఫ్ జిల్లా కన్వీనర్, డప్పు అశోక్ మాదిగ సంగారెడ్డి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking