ఖమ్మం ప్రతినిధి జులై 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంకల్పించి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రోఫైల్ రూపొందించడం జరిగింది. ఇట్టి ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించడంతో పాటు, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధికారులు, ఉద్యోగుల హెల్త్ ఫ్రొఫైల్ రూపకల్పనపై వైద్యాధికారులు కలెక్టర్ సూచనలు చేశారు. ప్రత్యేక వైద్య శిబిరంలో అవసరమైన మేర రిజిస్ట్రేషన్ కేంద్రాలు, శాంపిల్ కలెక్షన్ కేంద్రాలు, ఉద్యోగులు కన్సల్టేషన్ చేసేందుకు వీలుగా వైద్యులను అందుబాటులో ఉంచారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఉద్యోగిని వైద్యులు పరీక్షించి, వారి మెడికల్ హిస్టరీ తెలుసుకొని అవసరమైన పరీక్షలు చేశారు