సిపిఎస్ రద్దు దిశగా అడుగులు వెయ్యాలి
ప్రతినిధి జులై 25 (ప్రజాబలం) తెలంగాణ రాష్ట్ర 2024 -25 వార్షిక బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు నైపుణ్య కేంద్రాల ఏర్పాటు మరియు ప్రపంచ స్థాయి పాఠశాల ల ప్రకటన చెయ్యడం హర్షణీయం అని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU)రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ గురువారం పత్రిక ప్రకటన విడుదల చేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో 2324 కోట్ల తో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ తో పాటు ఉద్యోగాలు పొందేవిధం గా 65 ఐ టి ఐ లను ఆధునికీకరణ చేయడమే కాకుండా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అత్యున్నత విధానాల అమలు చేయడం తో పాటు రాష్ట్రంలో ని ప్రతి యూనివర్సిటీ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కొరకు 500 కోట్లు ప్రాతిపదించడం ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ,విద్యార్థులు డ్రగ్స్ నుండి దూరం వుండేలా చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో విద్య కు కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో వినియోగం లోకి వచ్చేలా చూడాలని తెలంగాణ రాష్ట్రములోని 3లక్షల 69 వేల ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు 2 లక్షల 87 వేల పెన్షనర్స్ కు సకాలంలో వేతనాలు ఇవ్వడం పాటు సకాలం లో డి ఏ లు మరియు మ్యానిఫెస్టోలో పొందుపరిచిన పాత పెన్షన్,పి ఆర్ సిఅమలు దిశలో ప్రజా పాలన ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరారు