తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్య రంగానికి మొండి చెయ్యి

 

వెంటనే రాష్ట్ర బడ్జెట్ సవరించి 30% నిధులు కేటాయించాలి

ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ నాయక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 25 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన 2,91,159 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 21,292 కోట్లు (7.31%) మాత్రమే కేటాయించడాని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎబివిపి (అఖిల భారత విద్యార్థి పరిషత్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ లేక మరియు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కేవలం 7.31% విద్యారంగానికి కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు కేటాయించిన 500 కోట్లు ఎలా సరిపెడతారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నిరుద్యోగులకు మరియు విద్యార్థులకు అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గత పాలకులను ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం.ఇకనైనా విద్యారంగంపై మీ వైఖరి మార్చుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎక్కడికి అక్కడ మంత్రులని గాని ఎమ్మెల్యే లేని గాని లేదా ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తున్నాం.తక్షణమే రాష్ట్ర బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎబివిపి తరపున డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking