పశువుల గుంపులతో ప్రజలకు ఇబ్బందులు

 

సామాజిక కార్యకర్తలక షేక్ సాబీర్ అలీ
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జులై 25

పట్టణంలో రద్దీ ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్న పశువులతో వాహనదారులు, పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా గాంధీ చౌరస్తా,రైల్వే స్టేషన్ రోడ్,
బస్టాండ్ రోడ్ లలో పశువులు గుంపులు గుంపులుగా తిష్ట వేసుకుని ఉండి ట్రాఫిక్ నకు ఇబ్బందులు కల్పిస్తూ వాహనదారుల ప్రమాదాలకు కారణం అవుతూ ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నాయి.
ఈ వర్షాకాలం సందర్భాల్లో ప్రమాదం బారిన పడకుండా వాహనదారు లే వాటిని పక్కకు తరలించి ప్రాయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.వీటిని నియంత్రించాల్సిన మున్సిపల్ సిబ్బంది కానీ ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీస్ సిబ్బంది కానీ ఈ దిశగా చర్యలు చేపట్టకపోగా బదులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూన్నాను.
కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పశువులను గోశాలకు తరలించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking