నీటి వృధాను తక్షణమే అరికట్టాలి

 

వీణవంక ప్రజాబలం ప్రతినిధి జులై 25

వీణవంక మండలంలోని లసుమ్మక్కపల్లి చెక్ డాం కు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అని కాంగ్రెస్ యూత్ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ కోరారు. వీణవంక రైతుల సంక్షేమం కోసం సాగు నీటిని వృధా చేయవద్దని గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కోట్ల పైచిలుకు నిధులతో వీణవంక వాగుపై లసుమ్మక్కపల్లి గ్రామం వద్ద చెక్ డ్యామ్ ను నిర్మించారు. చెక్ డాం కట్టకు గండిపడి గత సంవత్సర కాలంగా నీరు వృధాగా పోతుంది. నీరు వృధాగా పోవడంతో పాటు వరదకు 5 ఎకరాల సాగు భూమి కొట్టుకుపోయింది. చెక్ డాం కట్టిన కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించి మరమ్మతులకు చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి అని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking