ప్రజాపాలనలో దరఖాస్తుల వివరాలను తప్పులు లేకుండా వెబ్ సైట్ లో నమోదు చేయాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

 

మెదక్ జనవరి 5 ప్రజా బలం న్యూస్ :-

ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్ సైట్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ నమోదుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నెల డిసెంబర్ 28, 2023 నుండి ఈనెల ఆరవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను డాటా ఎంట్రీ ఆపరేటర్లు పరిశీలించి దరఖాస్తులు ఉన్న పూర్తి సమాచారాన్ని కచ్చితంగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని, నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

మున్సిపాలిటీలలో 55 బృందాలు , గ్రామపంచాయితీలలో 425 బృందాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు . ఈ బృందంలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఒక పంచాయతీ సెక్రెటర్ , ప్రజాపాలన దరఖాస్తుల కౌంటర్ ఇంచార్జ్ ఉంటారని తెలిపారు .ప్రజా పాలన లో వచ్చిన దరఖాస్తులను వెబ్ సైట్ లో నమోదు చేసేందుకు 319 మంది ప్రభుత్వ డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 161 ప్రయివేట్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు, మొత్తం గా 480 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . అన్ని మండల కేంద్రాలలో సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కోక్క కంప్యూటర్ ఆపరేటర్ కు 500 దరఖాస్తులు ఎంట్రీ చేయాల్సివుంటుందని అన్నారు.

ఈ నెల 6వ తేదీ నుండి 17వ తేదీ లోగా దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు, సెల్ నంబర్లను పూర్తి జాగ్రత్తతో తప్పులు లేకుండా నమోదు చేయాలని అన్నారు. ఎంట్రీ చేసిన దరఖాస్తులు ఒక్కటి కూడా గల్లంతు కాకుండా పూర్తి జాగ్రత్త వహించి భద్రపరచాలన్నారు. ఈరోజు నుండే పనులు ప్రారంభించాలని అన్ని సెంటర్లలో అవసరమైన స్పీడ్ గా పనులు పూర్తి చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయంతో పాటు నిరంతర విద్యుత్తు సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. పనులన్నింటినీ నాణ్యతతో వేగవంతంగా గడువులుగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ డాటా ఆధారంగానే లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం డాటా ఎంట్రీ ఆపరేటర్ల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ , జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా , ఈ డి ఏం సందీప్ , నర్సాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గోపి, తూప్రాన్ మున్సిపాలిటీ కమిషనర్ ఖాజా మొహీనుద్దీన్, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking