వరంగల్ తూర్పులో పలు డివిజన్లలో ప్రజా ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 5 :
ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ పేర్కొన్నారు.
శుక్రవారం జిడబ్ల్యు ఎం సి కమిషనర్ రిజ్వాన్ భాషా షేక్, సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని12 వ డివిజన్ దేశాయిపేట లోని షాది ఖానా లో, 19వ డివిజన్ వివర్స్ సెక్షన్ కాలనీ, కాశీబుగ్గలో, 36వ డివిజన్ చింతల్ లోని జమాతే ఇస్లామీ హింద్ భవనంలో, 34 వ డివిజన్ లోని భూపేష్ నగర్ శివనగర్ ప్రాంతాలలో నిర్వహించబడుతున్న ప్రజా పాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను మంత్రి సురేఖ సందర్శించి, అధికారులు, సిబ్బంది స్వీకరిస్తున్న దరకాస్తులను
తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నదని, ఇప్పటివరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 90% దరఖాస్తు స్వీకరించడం జరిగిందని తెలిపారు. క్రమ పద్ధతిలో ప్రజలకు ప్రజాపాలన దరఖాస్తులు అందుతున్నాయని, ప్రభుత్వ అధికారులు తోడ్పడు అభినందనీయమని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు పాలకుల లాగా కాకుండా సేవకులు వలే పని చేస్తున్నామని అన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. నిరుపేదలకు మధ్యతరగతి వారికి కావలసిన కనీస అవసరాలు తీర్చాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రగతి భవన్లో ప్రజల నుండి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమం మన జిల్లాలో పగడ్బందీగా కొనసాగుతుందన్నారు.
జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమాల్లో నియోజక వర్గ ప్రత్యేక అధికారి కృష్ణా రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.