ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి.

టి పి టి ఎఫ్ మండల అధ్యక్షులు పట్లూరి లక్ష్మణ్.

మెదక్ తూప్రాన్ జనవరి 5 ప్రజా బలం న్యూస్:-

టి పి టి ఎప్( TPTF) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము మెదక్ జిల్లా తూప్రాన్ మండల అధ్యక్షులు పట్లోరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో (ZPGHS) జడ్.పి.హెచ్.ఎస్ తూప్రాన్ నందు ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు పట్లోరి లక్ష్మణ్ మాట్లాడుతూ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబందించిన సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించి, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న టీచర్ల బదిలీలు పదోన్నతులు జరిపించాలని కోరారు. ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు సేకరించి మెగా (DSC) వేయాలని కోరారు. పదోన్నతులకు సంబంధించి టెట్ ను మినహాహించాలని, బదిలీ అయినా ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల జీతాలను నెల మొదటి తేది నాడే చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిలర్ రాజేంద్రప్రసాద్,
జిల్లా కౌన్సిలర్ పరమేశ్వరచారీ, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫ్లోరెన్స్, ఉపాధ్యాయులు లక్ష్మి, సత్తమ్మ, కరుణ, పద్మ, సుజాత, మంజుల,పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking