వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్19
రూర్బన్ స్కీం ద్వారా కేటాయించిన పనులను శీఘ్రగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో రూర్బన్ పథకం క్రింద చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనుల పై పనుల ప్రగతి పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూర్బన్ స్కీం జిల్లాలోని పర్వతగిరి క్లస్టర్ (రుర్బాన్)లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద
పర్వతగిరి క్లస్టర్‌లో రూ.30 కోట్లతో 95 పనులు చేపట్టగా రూ 3.92 కోట్ల వ్యయంతో 26 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, 35 అభివృద్ధి పనులు వివిధ పురోగ దశల్లో ఉన్నాయని, ఇంకను చేపట్టని
34 పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షేడ్స్, పంచాయతీ భవనముల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్, లైబ్రరీ, విలేజ్ హాట్, హస్తకళాకారులు, చిన్నతరహా పారిశ్రామిక వేత్తలకు సమీకృత గ్రామీణ మార్కెటింగ్ స్వర్గధామం పనులు పూర్తయ్యాయని, కొంకపాక గ్రామంలో మిల్లెట్ డీహస్కింగ్ యూనిట్, చింతనెక్కొండ, ఎంగుగల్లు, గోపనపల్లెలో కూరగాయల పంటలు, ఏనుగల్లులో జంతు ఆరోగ్య కేంద్రం, ఎనుగల్లులో 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ పనులు, పర్వతగిరిలో రూ.60 లక్షల పెట్టుబడితో షాపింగ్ కాంప్లెక్స్, లైబ్రరీ, విలేజ్ హాట్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
పర్వతగిరి గ్రామంలో రూ.2.60 కోట్లతో 3 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వ్యవసాయ గోదాం (గోదాం), రూ.2 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సంపత్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్, జిల్లా వైద్య శాఖ అధికారి వాసంతి, ఈఈ ఇరిగేషన్ రాజు, ఈఈ ఈడబ్ల్యూ కుమార్, ఈఈ పి ఆర్ ఇజ్జగిరి, జిల్లా ఉద్యానవనాలు అధికారి శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.