అంగన్వాడీ కేంద్రం పరిశీలన మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 : అంగన్వాడీ కేంద్రాలు పరిశీలన మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ పేర్కొన్నారు.మంగళవారం అయన మున్సిపాలిటీలో 14 వ వార్డ్ లో అంగని వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అంగన్వాడీ రికార్డులను పరిశీలించారు.పరిసరాల పరిశుభ్రతపై వారిని ప్రశ్నించారు.గదులు, పరిసరాలు పరిశుభ్రంగా వుంచుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్ రోజు రోజువారీగా వస్తున్నారా..? అంటూ పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సెంటర్ బోర్డ్ లేకపోవడంతో బోర్డ్ ఏర్పాటు చేయాలని అంగని వార్డ్ టీచర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక కుమార్, మున్సిపల్ సిబ్బంది దినేష్, సందీప్,శేఖర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking