వీరాంజనేయ క్షేత్రం వద్ద భక్తితో శనీ త్రయోదశి పూజలు.

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణ కేంద్రంలోని మహాన్యుతమైన వీరాంజనేయ క్షేత్రం లో శని త్రయోదశి సందర్భంగా శనేశ్వర భగవాన్ విగ్రహానికి ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు విశేష పూజలు , అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. అనంతరం ఆత్రే శర్మ మాట్లాడుతూ శని దోషాలు నవగ్రహ దోషాలు ఉన్నవారికి శనిపీడతో బాధపడుతున్న వారు ఎవరైనా శని త్రయోదశి నాడు శనీశ్వర భగవంతునికి పూజలు నిర్వహించి వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నచో భగవంతుని ఆశీర్వాదాలతో వారికి సకల శుభకార్యాలు , అనుకున్న పనులు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ స్వామి హనుమాన్ బృందం సభ్యులు, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking