తెలంగాణ రిటైర్డు పోలీస్ అధికారుల సంఘం నాయకులు గురువారం రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన డాక్టర్ జితేందర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఆయనను మర్యాద పూర్వకంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఐజీ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సీవీ శేషగిరి రావు, టీ.నరసింగరావు, కార్యనిర్వహక కార్యదర్శి రాజయ్య, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గోపాలరాజు, సుకుమార్ రెడ్డి, కే.గోవర్ధన్ రెడ్డి తదితరులు డీజీపీ నీ కలిసిన వారిలో ఉన్నారు. అసోసియేషన్ కు సంబంధించిన అంశాలు, భావన నిర్మాణం, పెండింగ్ బిల్లులపై డీజీపీ తో చర్చించామని, ఆయన సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి, పెండింగ్ బిల్లుల సత్వర విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఈసీ సభ్యుడు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.