జగిత్యాల, ఫిబ్రవరి 19,(ప్రజాబలం ప్రతినిధి): సాహితీ రంగంలో విశేష కృషి చేసే సాహితీవేత్తలు, రచయితలకు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అందించే ఉగాది పురస్కారానికి ధర్మపురి నివాసి ప్రముఖ బాలసాహితి వేత్త సంగనబట్ల చిన్న రామకిష్టయ్య ఎంపికయ్యారు.జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ప్రముఖ బాలసాహిత్య వేత్త సంగభట్ల చిన్నరామకృష్ణయ్యను తెలుగు వెలుగు ఉగాది పురస్కారానికి ఎంపిక చేశారు. వచ్చే నెల మార్చి 12వ తేదీన చెన్నెలో జరిగే కార్యక్రమంలో చిన్న రామకిష్టయ్యను
‘తెలుగు వెలుగు’ బిరుదు పురస్కారంతో
సత్కరించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. బాల సాహిత్యంలో రామకృష్ణయ్య
సుమారు 700 పైన బాల సాహిత్య కథలు ఉన్నాయని ప్రధానంగా 500 వరకు తెలుగులోని ప్రముఖ దినపత్రికలన్నింటిలో ప్రచురితం అయ్యాయని రామకిష్టయ్య తెలిపారు.రామకృష్ణయ్య రాసిన కనువిప్పుతో పాటు పక్షి సాక్ష్యం, చేప నవ్వింది, రామకృష్ణ బాలల నీతిశతకం, నృహరి శతకం తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలలో ముద్రించబడ్డాయి. బాల సాహిత్యరంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఇదివరకే అనేక
పురస్కారాలతో గౌరవించబడగా తాజాగా తెలుగు వెలుగు పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ధర్మపురిలోని స్నేహితులు, సాహితీ ప్రియులు, బందువులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు.