శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం వద్ద ధర్నా

అంబర్‌పేట్‌ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారం నాడు ఉదయం భారతీయ జనతా పార్టీ మరియు శివసేన ఆధ్వర్యంలో చే నెంబర్‌ చౌరస్తాలో గల అతి పురాతన శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఫ్లై ఓవర్‌ పనులు దాదాపుగా పూర్తి అవుతున్న మన సీతారామచంద్రస్వామి దేవాలయము ను పట్టించుకోవడంలేదని త్వరగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని దేవాలయం చుట్టూ ఉన్న మట్టి దిబ్బలను వెంటనే తొలగించి త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌ గోపాల్‌ రెడ్డి తో మాట్లాడగా వారు సానుకూలంగా స్పందించి త్వరలో  జి కిషన్‌ రెడ్డి సౌజన్యంతో పనులు త్వరగా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా మాకు హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ సుదర్శన్‌ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధానా కార్యదర్శి
దామోదర్‌ నాయుడు బొమ్మరాజు ఈశ్వర్‌ , సునీల్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా స్పోర్ట్స్‌ పర్సన్‌ గణేష్‌ గట్ల రమేష్‌ ఆర్కే చందు గోపాల్‌ , దుంపల జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking