నాగపూర్‌ రోడ్డు ప్రమాదంపై రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ సమీపంలో (నాగపూర్‌ – ప్రయాగ్‌రాజ్‌ జాతీయ రహదారిపై) జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌ నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking