మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి లింగన్న గత వారం క్రితం అనారోగ్యానికి గురి కాగా హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో చేరగా శనివారం రోజున వైద్య కర్చుల కోసం మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎల్ ఓ సీ ద్వారా 2,50,000(రెండు లక్షల యబది వెలు)రూపాయలు అందచేశారు.ఆపదలో వారి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి పాల్గొన్నారు