రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే. మహేందర్ రెడ్డి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాబలం ప్రతినిధి:ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన ఆదిశ్రీనివాస్
ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు, పాలకవర్గానికి శుభాకాంక్షలు.
మీ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను.
ఒక సంఘం అంటే ఒక బలం, అందరం కలైకట్టుగా ఉండి సమస్యలు ఎదుర్కోవడానికి ఏర్పడిరది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు, కాటన్, పాలిస్టర్ దుస్తులు ఎక్కడ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సిరిసిల్ల నే.
పాలిస్టర్, కాటన్ పరిశ్రమ కొత్త పుంతలతో ఆధునిక టెక్నాలజీతో ముందుకు రావాలి, దానికి మీకు మా సహకారం ఉంటుంది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సీఎం, మంత్రులు దృష్టి సారించారు తొందరలోనే పరిష్కారం అడుగులు వేస్తున్నాం.
బతుకమ్మ చీరల పాత బకాయిలు 197 కోట్ల రూపాయలు విడుదల చేసాం, త్వరలో మరో 4 కోట్లు విడుదల చేయబోతున్నాం.
గత ప్రభుత్వంలో తయారు చేసిన 7 లక్షల చీరెలు ఉన్నాయి వాటిని వినియోగించుకొని డబ్బులు చెల్లిస్తాం.
ఇప్పుడు 10 %నజూ% కాకుండా, త్వరలో 20 హెచ్పిపిల కరెంటు, యారన్ డిపో ఏర్పాటు చేయబోతున్నాం.
నూతన పాలక వర్గాన్ని ఫోన్ లో అభినందించిన పొన్నం ప్రభాకర్.
నేత కార్మికులకు ఆడుకునే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది పొన్నం.
మీ సమస్యలు ప్రతిసారి మా నాయకులు దృష్టికి తీసుకువస్తున్నారు. నేతన్న, గీతన్న ఒకటే అన్న పొన్నం.
1కోటి 30 లక్షల చీరెలు, 8 కోట్ల మీటర్ల బట్టకు ఆర్డర్ ఇస్తాం.
నాలుగైదు రోజుల్లో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అయ్యర్ సిరిసిల్లకు రాబోతున్నారు.
ఇక్కడ ఉన్న సమస్యలు మాట్లాడుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.
తమిళనాడు లో ఉన్న వస్త్ర పరిశ్రమ తరహాలో సిరిసిల్లలో ఇచ్చే అవకాశం కోసం ఆలోచన చేస్తున్నాం.
నూతన పాలకవర్గాన్ని సన్మానించిన ఆది.