జీవో 317 నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి

తపస్ మెదక్ జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం

ప్రజాబలం దినపత్రిక మెదక్
హవెలి ఘన్ పూర్ 28. 09.2024:

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఘనపూర్ శాఖ ఆధ్వర్యంలో కూచన్ పల్లి,తోగుట,ఘనపూర్, బూరుగుపల్లి, రాజీ పేట్ పాఠశాలల లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు జిడ్డి ఎల్లం మాట్లాడుతూ జీవో 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ఉపాధ్యాయులను హేతుబద్ధీకరణ పేరుతోని ఇబ్బందులు పెట్టరాదని, రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు చేయాలని , పాఠశాలల లో మౌలిక వసతులు కల్పించాలని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో తపస్ హవెలి ఘనపూర్ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు అశోక్, జిల్లా బాధ్యులు రవిబాబు, రాజేశ్వర్, వినోద్, రమేష్, శ్రీనివాస్ తపస్ మండల బాధ్యులు బిక్షపతి,తిరుపతి, అనిల్,పరంకుశం, సురేందర్, నర్సింలు రవి, క్రిష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking