విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాల జిల్లా ప్రజాబలం ప్రతినిధి:జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ శనివారం మల్హర్‌ మండలంలోని రుద్రారం ఎంపిపిఎస్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారితో ఇంగ్లీష్‌ పాఠాలు చదివించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యార్థులు ఆంగ్ల పాఠాలు చక్కగా చదవడం పట్ల అభినందించారు. విద్యార్థులు. మంచిగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చేపట్టిన మరమ్మతు పనులు, మంచినీటి సౌకర్యం, హ్యాండ్‌ వాష్‌, డిజిటల్‌ విద్యాబోధన వంటి అంశాలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజన కార్మికులు నెల నెలా వేతనాలు చెల్లింపుతో పాటు, గ్యాస్‌ మంజూరు చేయాలని కోరగా తగు చర్యలు తీసుకుంటాని తెలిపారు.
కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking