చేగుంట 28/09/24 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్ల చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భగత్ సింగ్ జయంతి నిర్వహించారు
ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ భగత్ సింగ్ 1907 సెప్టెంబరు 28 న పూర్వ పంజాబ్ లోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు అని,భారత స్వాతంత్ర్య సమర యోధుడు అని, ఆయన స్వాతంత్ర్య పోరాట శైలి నేటి యువతకు ఆదర్శమని ఆయన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తి అని వారు అన్నారు
.ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రఘుపతి, తపస్ ఎస్ టి యు మండల అధ్యక్షులు రావుల వెంకటేష్, గర్దాస్ మనోహర్ రావు తపస్ జిల్లా కార్యదర్శి సుమతి , సురేందర్, రమాదేవి, రమ,సరస్వతి,శ్రీవాణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు