తూప్రాన్ మున్సిపాలిటీకి ఒక కోటి యాబై లక్షల రూపాయలు సడిఎఫ్ నిధులు విడుదల

 

మెదక్ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ కొండా సురేఖ గారి సహకారంతో

ప్రజాబలం దినపత్రిక
మెదక్ -తూప్రాన్ 28.09.2024:

శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ సారధి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ మరియు తెలంగాణ రాష్ట్ర అటవి పర్యావరణ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు మెదక్ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ కొండా సురేఖ గారి సహకారంతో.గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి గారి అలుపెరుగని కృషితో తూప్రాన్ మున్సిపాలిటీకి ఒక కోటి యాబై లక్షల రూపాయలు (1,50,00000) సడిఎఫ్ నిధులు నుండి వివిధ వార్డుల అభివృద్ధి నిమిత్తం మంజూరు చేయడం జరిగింది. ఇట్టి నిధుల నుండి ఈ రోజు గౌరవ తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో 6వ వార్డు కౌన్సిలర్ శ్రీ పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా గారి అధ్యక్షతన మారుతీ నగర్ నందు సీసీ రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఏళ్ల తరబడి రోడ్లు సరిగా లేక ఇబ్బంది పడుతున్న మారుతీ నగర్ కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం. జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కాజా మొయిజుద్దీన్ కౌన్సిలర్లు పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా,జిన్న భగవాన్ రెడ్డి,బాణాపురం రాజు కుమ్మరి రఘుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు గౌడ్ ఉమర్ అనిల్ మరియు మారుతి నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొనడం జరిగింది.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking