కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి:నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఖలీమ్ పై సైదాబాద్ ఎస్ ఐ , కానిస్టేబుల్ దాడిని ఖండిస్తూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ హైదరాబాద్ వారి పిలుపు మేరకు తమ విధులను శుక్రవారము బహిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతు న్యాయ వాదులను లక్ష్యం గా చేసుకొని పోలీసులు దాడి చేస్తున్నారని, న్యాయ వాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం లో బార్ అసోసియేషన్ సెక్రటరీ భీమా సాయెబ్ , మేంబర్ బెజ్జంకి శ్రీకాంత్, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ గుప్త, నరేష్, గోనెపల్లి శ్రీనివాస్ గౌడ్, కొలకాని భూమయ్య, కె చంద్రమౌళి, కొత్త నరసింహ రెడ్డి, ఎస్ శ్రీధర్ రావు, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పేరుక శ్రీనివాస్, తిరుపతి, పటేల్, శ్రీనివాస్, సింగ్, భార్గవ్, స్వామీ, సుధాకర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.