ఎమ్మెస్పి జిల్లా కన్వీనర్ దుమాల గంగారం మాదిగ
జగిత్యాల, ఆగస్టు 23: ఎమ్మెల్యేలపై దళితులు అసంతృప్తితో ఉన్నారని దళితబందు, డబుల్ బెడ్ రూమ్, కేజీ టూ పిజి విద్య వంటి ఎన్నో పథకాలు దళితులకు కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని ఇదే అసంతృప్తికి కారణమని ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం అన్నారు.
జగిత్యాల పట్టణ కేంద్రంలో బుధవారం ప్రెస్ క్లబ్ లో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బోనగిరి కిషన్ మాదిగ ఆధ్వర్యంలో విడుదల చేసిన ప్రకటనలో ఎంఎస్పి జిల్లా కన్వీనర్ దుమాల గంగారం, కో కన్వీనర్ బెజ్జంకి సతీష్ హాజరై వారు మాట్లాడారు. 2014 ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మేనిఫెస్టివలేనివి అమలు చేశారని అమలు చేశావని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను భ్రమల్లో ముంచేస్తున్నారు. ఇకనైనా దళితులను బ్రాహ్మలో పెట్టడం మానుకొని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం . మీరు దళిత బంద్ ఇవ్వన ఎడల మీ ఓటమి లక్ష్యంగా దళితులందరూ పనిచేస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్ ,మహాజన సోషలిస్ట్ పార్టీ జగిత్యాల డివిజన్ ఇంచార్జ్ నక్క సతీష్ మాదిగ,బోనగిరి లక్ష్మణ్,మీసాల చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.