ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన లక్ష్యం సాధించాలి

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 23 (ప్రజాబలం) ఖమ్మం బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ కమీషనర్లతో గృహాలక్షి జీవో 59 లేఅవుట్ ల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గృహాలక్షి పథకానికి సంబంధించి, సత్తుపల్లి మునిసిపల్ పరిధిలో 1090, మధిర మునిసిపల్ పరిధిలో 1327, వైరా మునిసిపల్ పరిధిలో 1351 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మునిసిపల్ కమీషనర్లు దరఖాస్తుల్లో కనీసం 10 శాతం సూపర్ చెక్ క్రింద స్వయంగా పరిశీలన చేయాలన్నారు. అర్హత గల దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఫోటోలు, జిపిఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు. మునిసిపాలిటీ ల వారిగా లే అవుట్ దరఖాస్తులు, ప్లాట్ల వివరాలు సమీక్షించారు. సెప్టెంబర్ కల్లా క్షేత్ర పరిశీలన పూర్తి చేయాలన్నారు. జీవో 59 క్రింద రెండో విడత డిమాండ్ నోటీస్ ల జారీ పూర్తి చేయాలని, మొదటి విడత డిమాండ్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రెండో విడత డిమాండ్ విషయంలో దరఖాస్తుదారులకు ముందస్తుగా పూర్తి అవగాహన కల్పిస్తున్నందున డిమాండ్ మొత్తం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మునిసిపాలిటీలకు కేటాయించిన విఆర్వో, విఆర్ఏ లకు వార్డులు కేటాయించి, వారికి విధులు అప్పగించాలన్నారు.

ఈ సమీక్షలో సత్తుపల్లి, మధిర, వైరా మునిసిపల్ కమీషనర్లు సుజాత, రమాదేవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking