ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మూడు డిగ్రీ కళాశాలలో మంజూరు ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్ని వసతులతో కలిగిన కలిగిన( మహాత్మ జ్యోతి బాపూలే )మూడు డిగ్రీ కళాశాల లు మంజూరు చేసినట్లు ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్ బుధవారం తెలిపారు.ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లలో మహిళా డిగ్రీ కళాశాలలు మంజూరు కాగా మంచిర్యాల జిల్లాలోని గుడిపేటలో బాలుర కోసం డిగ్రీ కళాశాల మంజూరు అయినట్లు తెలిపారు.ఈ డిగ్రీ కళాశాలల్లో చదవదలుచుకున్న అభ్యర్థులు ఈ నెల 31 లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల్లో హాజరుకావాలని తెలిపారు. బి ఏ (ఈ పిహెచ్ ),బీకాం (సి ఏ ), బిఎస్సి (ఎంపీసీఎస్ ), బిఎస్ ( బి జెడ్ సి ) కోర్సులు ఉన్నాయని తెలిపారు. మూడు డిగ్రీ కళాశాలల్లో కలిపి 120 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాల కే సి బి (హౌసింగ్ బోర్డ్ కాలనీ) ప్రిన్సిపాల్ విద్య
9963561284 ఆసిఫాబాద్( బాబాపూర్) మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సృజన 9154902277, మంచిర్యాల జిల్లా గుడిపేట బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ 9948989949 మరిన్ని వివరాలకు ఈ నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking